
తెలంగాణ
అక్వాన్ తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో గురువారం నుంచి వర్షాలు.. ఖమ్మం, కొత్తగూడెం సహా పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తుపాను ప్రభావంతో తెలంగాణలో గురువారం నుంచి వాతావరణం మారనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












