న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని పుణే నగర ప్రజారవాణాకు మరో కీలక మలుపు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుణే మెట్రో లైన్-3 (పింక్ లైన్)ను ప్రారంభించి, రెండో దశ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టుల విలువ సుమారు రూ.21,800 కోట్లు.

పింక్ లైన్ ప్రత్యేకతలు

  • వ్యయం: రూ.8,300 కోట్లకు పైగా.. పొడవు సుమారు 23 కి.మీ.
  • మాన్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ మెట్రో స్టేషన్ వరకు మార్గం
  • హింజవాడి ఐటీ హబ్‌ను శివాజీనగర్‌తో అనుసంధానం
  • పూర్తిగా మహిళా ట్రైన్ ఆపరేటర్లతో నిర్వహణ
  • విద్యుత్ అవసరాల్లో సుమారు 30 శాతం సౌరశక్తి నుంచే

రెండో దశకు శంకుస్థాపన (రూ.13,500 కోట్లు)

  • లైన్ 2ఏ: వనాజ్–చాందినీ చౌక్, లైన్ 2బీ: రామ్‌వాడి–విఠల్‌వాడి (కలిపి 12.75 కి.మీ.)
  • లైన్ 4: ఖరాడి–ఖడక్‌వాస్లా (25.52 కి.మీ.)
  • లైన్ 4ఏ: నల్ స్టాప్–మాణిక్ బాగ్ (6.12 కి.మీ.)

ఈ ప్రాజెక్టులతో ఖరాడి, మగరపట్ట, హడప్‌సర్, స్వర్గేట్, నాందేడ్ సిటీ, వార్జే వంటి ప్రాంతాలకు మెట్రో సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్వర్గేట్, నల్ స్టాప్, ఖరాడి బైపాస్ వద్ద ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటు చేస్తారు. సొంత వాహనాలపై ఆధారపడటం తగ్గి, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.