హైదరాబాద్: హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మకు మరో కీలక బాధ్యత దక్కింది. ఖతార్‌లోని దోహాలో జరగనున్న ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్-ఏ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రజత్ పాటీదార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

టోర్నీ ఫార్మాట్

  • గ్రూప్-బీ: భారత్-ఏ, పాకిస్థాన్-ఏ, యూఏఈ, నేపాల్
  • గ్రూప్-ఏ: బంగ్లాదేశ్-ఏ, శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ, హాంకాంగ్ చైనా
  • ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు.. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీస్
  • ఫైనల్ నవంబర్ 29 (ఆదివారం)

భారత్-ఏ జట్టు

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటీదార్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్.

దూకుడైన బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, రింకూ సింగ్‌లతో జట్టు బలంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్-ఏతో పోరు ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.