దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపు కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) రిటైర్డ్ ఉద్యోగులు హైదరాబాద్లో నిరసనకు దిగారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు రిటైర్డ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ళ తరబడి సేవలందించి పదవీ విరమణ చేసిన తమకు ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం న్యాయం చేయడం లేదని వారు మండిపడ్డారు.
వెంటనే బకాయిలు చెల్లించకుంటే మరింత తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు హెచ్చరించారు. ఈ అంశంపై ఆర్టీసీ యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.






