తెలంగాణ సచివాలయ ఆవరణలో సౌరశక్తి ఆధారిత వాహనాల పార్కింగ్ షెడ్ల నిర్మాణం చేపట్టారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

పార్కింగ్ షెడ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలకు నీడనివ్వడంతో పాటు, ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సచివాలయ అవసరాలకు వినియోగించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ భవనాల్లోనూ ఇలాంటి సౌర విద్యుత్ ప్రాజెక్టులను విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.