అధికారిక అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆరోపించారు.
పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటుపై చర్చల నిమిత్తం ఈ పర్యటన చేపట్టాలని భావించినట్టు సీఎం వివరించారు. అనుమతి నిరాకరణ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు.







