తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్) ఓపెన్‌కాస్ట్ గనులపై పడింది. నీరు చేరడంతో పలు గనుల్లో బొగ్గు తవ్వకం పనులు నిలిపివేయాల్సి వచ్చింది.
భారీ యంత్రాల నిర్వహణకు అంతరాయం ఏర్పడటంతో ఉత్పత్తి లక్ష్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గనుల్లో నీటిని తోడివేసే పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు.
వాతావరణం అనుకూలించిన వెంటనే ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.







