మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె మాజీ ఓఎస్‌డీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక సమర్పించారు.

ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లకు కూడా ఈ నివేదిక అందజేసినట్టు తెలిసింది. తుది నిర్ణయం అధిష్టానానికే వదిలేస్తున్నట్టు మల్లు రవి స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై పార్టీలో ఎలాంటి బహిరంగ చర్చలు చేయవద్దని సీనియర్ నేతలు కోరుతున్నారు. అధిష్టానం తుది నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.