యోసు (దక్షిణ కొరియా): 5 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో జరిగే కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం ప్రారంభమైంది. ఇటీవల జర్మనీలో హైలో ఓపెన్ టైటిల్ గెలిచిన భారత స్టార్ లక్ష్య సేన్ ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి రౌండ్‌లో అతడు చైనాకు చెందిన డాంగ్ టియాన్ యావోతో తలపడాల్సి ఉంది. దీంతో పురుషుల సింగిల్స్‌లో సీనియర్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్‌పైనే భారత్ ఆశలు పెట్టుకుంది.
తొలి రౌండ్‌లో భారత ఆటగాళ్ల ప్రత్యర్థులు
- పురుషుల సింగిల్స్: హెచ్‌ఎస్ ప్రణయ్ vs యూ టే బిన్ (దక్షిణ కొరియా)
- మహిళల సింగిల్స్: తన్వీ శర్మ vs మనామీ సుయిజు (జపాన్)
- మహిళల సింగిల్స్: మాళవిక బన్సోద్ vs సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా, 4వ సీడ్)
- మహిళల సింగిల్స్: అన్మోల్ ఖర్బ్ vs రేచల్ చాన్ (కెనడా)
- మహిళల డబుల్స్: సోనాలి సింగ్–రితికా ఠాకర్ vs లౌడియా చెల్సియా గ్రిసెల్డా–నొజోమి షిమిజు
- మిక్స్‌డ్ డబుల్స్: ధ్రువ్ రావత్–కె.మనీషా vs ఝూ యి జున్–లి కియాన్ (చైనా, 7వ సీడ్)
మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ తన్వీ శర్మతో పాటు మాళవిక బన్సోద్, అన్మోల్ ఖర్బ్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్‌లోనే నాలుగో సీడ్‌ను ఎదుర్కోనున్న మాళవికకు కఠిన సవాల్ ఎదురుకానుంది.







