తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు పార్టీ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీకి లేఖ రాశారు. తనపై, తన కుమార్తెపై వస్తున్న ఆరోపణల వెనక ఎవరు ఉన్నారో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇటీవల తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేయడంపై ఆమె ఇప్పటికే వివరణ ఇచ్చారు. తాజాగా తనపై జరుగుతున్న దాడులపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరారు.

ఈ పరిణామంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.