హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లాపూర్‌లోని సుమంత్ నివాసం వద్దే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ వ్యాపారిని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారన్న ఆరోపణలతో సుమంత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతడి డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరోవైపు మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం అవినీతిని బయటపెడతానంటూ సురేఖ కూతురు సుష్మిత చేసిన ఆరోపణలతో కొందరు ఎమ్మెల్యేలు ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఓఎస్డీ డ్రైవర్ అరెస్టు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.







