హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో మధ్యాహ్నం ఏడంతస్తుల నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు.

ఆరో అంతస్తు స్లాబ్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై పడటంతో నష్టం మరింత తీవ్రమైందని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరింత మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు కొనసాగుతోంది.

భవన నిర్మాణంలో లోపాలు కారణమా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.