మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. నవంబర్ 6, 7 తేదీల్లో నగరవ్యాప్తంగా నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక తనిఖీల్లో 578 మంది మందుబాబులు పట్టుబడ్డారు.
వాహనాల వారీగా
- ద్విచక్ర వాహనాలు: 495
- ఆటోలు (త్రిచక్ర వాహనాలు): 28
- కార్లు, ఇతర వాహనాలు: 55
రక్తంలో ఆల్కహాల్ స్థాయి (బీఏసీ – మి.గ్రా./100 మి.లీ.)
- 30–50: 115 మంది
- 51–100: 257 మంది
- 101–150: 111 మంది
- 151–200: 52 మంది
- 201–250: 27 మంది
- 251–300: 11 మంది
- 300 పైగా: 5 మంది
పోలీసుల హెచ్చరిక
మద్యం తాగి వాహనం నడపడాన్ని ఏమాత్రం సహించేది లేదని (జీరో టాలరెన్స్), ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు సహకరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మరోవైపు వరుస తనిఖీల కారణంగా పలువురు ఆటో డ్రైవర్లు విధులకు రాకపోవడంతో ఆటో యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి.







