హైదరాబాద్ వేదికగా ఏడో అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సదస్సు సెప్టెంబర్ 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సుకు 35కుపైగా దేశాల నుంచి 1,500 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నగర రియల్టీ మార్కెట్లో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ రియల్ ఎస్టేట్ హబ్గా నిలబెట్టే దిశగా ఈ సదస్సు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సదస్సులో పలు కీలక ప్రకటనలు, ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.