హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 24 ఏళ్ల యువకుడు దుర్మరణం చెందాడు. వేగంగా వచ్చిన లారీ అతడి బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ మార్గంలో వాహనాల వేగ నియంత్రణపై అధికారులు మరింత దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.