తెలంగాణ
హనుమకొండ ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిలిపి ఉన్న కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం. మృతురాలిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హనుమకొండ జిల్లా ఎల్‌కతుర్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిలిపి ఉన్న ఓ కారు డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమై కలకలం రేపింది. చాలా రోజులుగా అక్కడే నిలిచి ఉన్న వాహనం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అంకితి మానస (33)గా గుర్తించారు. కారు యజమానిగా కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మిల్కూరి వినోద్‌ను గుర్తించి పోలీసులు విచారిస్తున్నారు. మానసకు మూర్ఛ వచ్చి మృతి చెందిందని, భయంతో మృతదేహాన్ని వదిలేశానని వినోద్ చెబుతున్నట్టు సమాచారం. అయితే మూడు రోజుల క్రితం తమ ఇంటి నుంచి తీసుకెళ్లిన వినోదే కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

తెలంగాణ
అక్వాన్ తుపాను ఎఫెక్ట్: తెలంగాణలో గురువారం నుంచి వర్షాలు.. ఖమ్మం, కొత్తగూడెం సహా పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

తెలంగాణ
సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోళ్లలో జాప్యం: హరీశ్ రావు

తెలంగాణ
హైదరాబాద్‌లో అండాల దందా గుట్టురట్టు: 43 మంది యువతులకు విముక్తి, 9 మంది అరెస్ట్

తెలంగాణ
సమ్మక్క సాగర్‌కు ఎన్వోసీ కోసం రాయ్‌పూర్‌కు సీఎం రేవంత్: ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్తో భేటీ

తెలంగాణ
ఆన్లైన్ ఫార్మసీలపై టీజీ సేఫ్ కొరడా: 23 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్

తెలంగాణ
