హైదరాబాద్లోని చారిత్రక గవర్నమెంట్ సిటీ కాలేజీ భవనంలో ఒక భాగం పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది. ఈ ఘటన సమయంలో తరగతులు జరగకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
పాత భవనం కావడంతో నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి, భవనం మిగతా భాగాల భద్రతపై నివేదిక కోరారు.
విద్యార్థుల భద్రత దృష్ట్యా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలపై తక్షణ తనిఖీలు చేపట్టాలని విద్యాశాఖను కళాశాల యాజమాన్యం కోరింది.







