బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో సిద్దిపేట్, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

_1.jpg)






