తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15 వేల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. వెంటనే ఈ నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, నర్సింగ్ కోర్సులు చదువుతున్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు.

నిధులు విడుదల చేయకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.