చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో యానాంలో ఓ మత్స్యకారుడు తన భార్యను కొట్టి, గొంతు నొక్కి చంపిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించి కోరింగా నదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలు పువ్వల రేఖ (26)గా గుర్తించారు. నిందితుడు చెక్క అపారావు (29)ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వీరిది ఆరేళ్ళ వైవాహిక జీవితం కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
శనివారం మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెళ్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.







