విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన తాజా హుండీ లెక్కింపులో రూ.3.91 కోట్ల ఆదాయం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
నగదుతో పాటు వివిధ దేశాల కరెన్సీ, బంగారం, వెండి వస్తువులు కూడా హుండీలో లభించాయి. పండుగ సీజన్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం అధికంగా నమోదైంది.
బ్యాంకు అధికారులు, దేవస్థానం సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు ప్రక్రియ నిర్వహించినట్టు దేవస్థానం వర్గాలు తెలిపాయి.







