తిరుమలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాయి.

దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అదనపు పోలీసు బలగాలను తిరుపతి, తిరుమలలో మొహరించనున్నారు.

క్యూ లైన్ల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి గదులను మెరుగుపరచాలని టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.