ఆంధ్రప్రదేశ్
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర వర్మ.. నందమూరి కుటుంబీకుల హాజరు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కొత్త ఛైర్మన్‌గా శ్రీధర వర్మ బాధ్యతలు స్వీకరించారు.
తిరుపతిలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎస్వీబీసీ నూతన ఛైర్మన్‌గా శ్రీధర వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఛానల్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించి శ్రీవారి భక్తి ప్రచారాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తానని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప తదితర నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కూటమి పార్టీల నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. టీటీడీ అభివృద్ధికి దివంగత ఎన్టీ రామారావు భూమి దానం చేసిన నాటి నుంచి తమ కుటుంబానికి నాలుగు తరాలుగా ఆలయ సేవలతో అనుబంధం ఉందని నందమూరి మోహనకృష్ణ అన్నారు.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు: నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల్లో చర్మ, దంత సమస్యలు, రక్తహీనత: 2.65 లక్షల మందికి వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: కిలోమీటర్ పరిధిలో ప్రజల తరలింపు

ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్త హంగులతో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం: 14 గ్యాలరీలు, 8 వేలకు పైగా కళాఖండాలు

ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపానుగా బలపడుతున్న ‘అక్వాన్’: 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

ఆంధ్రప్రదేశ్
