విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం (సింహాచలం)లో నిర్వహించిన తాజా హుండీ లెక్కింపులో రూ.2.11 కోట్ల ఆదాయం వచ్చినట్టు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
నగదుతో పాటు దేశ, విదేశీ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాలు కూడా హుండీలో లభించినట్టు అధికారులు తెలిపారు. పండుగ, ప్రత్యేక పూజా దినాల నేపథ్యంలో భక్తుల తాకిడి పెరగడంతో హుండీ ఆదాయం అధికంగా నమోదైంది.
లెక్కింపు ప్రక్రియను ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది సమక్షంలో పారదర్శకంగా నిర్వహించినట్టు దేవస్థానం వర్గాలు తెలిపాయి.







