ఆగస్ట్ 31 వరకే దరఖాస్తు గడువు.. డిగ్రీ పూర్తి చేసిన వారికి సదవకాశం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (క్లరికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9,766 పోస్టుల్లో తెలంగాణలో 260 రెగ్యులర్ పోస్టులు కేటాయించారు. ఆగస్ట్ 31లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) అంటే క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 9,766 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 7,680 రెగ్యులర్ పోస్టులు, 2,086 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి 260 రెగ్యులర్ పోస్టులు కేటాయించారు. వీటిలో జనరల్ కేటగిరీకి 105, ఓబీసీకి 70, ఎస్సీకి 41, ఈడబ్యూఎస్కు 26, ఎస్టీకి 18 పోస్టులు కేటాయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఈసారి ప్రత్యేక కేటాయింపులు ప్రకటించనప్పటికీ, ఇతర రాష్ట్రాల్లోని పోస్టులకు కూడా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయో పరిమితి జనరల్ కేటగిరీకి 20 నుంచి 28 సంవత్సరాలు, ఓబీసీకి 31 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 33 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
ఆగస్ట్ 11న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 31తో ముగిసే అవకాశం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలు సెప్టెంబర్ 26, 27 తేదీల్లో, అలాగే అక్టోబర్ 3న (తాత్కాలిక షెడ్యూల్) నిర్వహించే అవకాశం ఉండగా, మెైన్స్ పరీక్ష నవంబర్ 23న జరగనుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రుసుం మినహాయింపు ఉంది.

ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక వేతనం సుమారు రూ.26,730 ఉండగా, అలవెన్సులతో కలిపి మొత్తం వేతనం నెలకు దాదాపు రూ.46,000 వరకు లభించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక SBI వెబ్‌సైట్ ద్వారా వివరాలు పరిశీలించి, గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.