రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రెండు కోట్ల సీడ్‌బాల్స్ పంపిణీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంఘాలను భాగస్వాములను చేస్తూ సీడ్‌బాల్స్ తయారీ, పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖాళీ ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, రహదారుల వెంబడి వీటిని జల్లడం ద్వారా సహజసిద్ధంగా మొక్కలు మొలకెత్తేలా చర్యలు చేపడుతున్నారు.
రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల సీడ్‌బాల్స్‌ను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.







