ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ జిల్లాలో కాలువలో బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 20 మంది విద్యార్థులకు గాయాలు

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో శ్రీచైతన్య పాఠశాల బస్సు తారకరామ కాలువలో బోల్తా పడటంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబాడిపాలెం సమీపంలో ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీచైతన్య పాఠశాల విద్యార్థుల బస్సు తారకరామ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. సంఘటన స్థలానికి పోలీసులు, స్థానికులు వెంటనే చేరుకుని కాలువలో చిక్కుకున్న విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై జి.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు: నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల్లో చర్మ, దంత సమస్యలు, రక్తహీనత: 2.65 లక్షల మందికి వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: కిలోమీటర్ పరిధిలో ప్రజల తరలింపు

ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్త హంగులతో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం: 14 గ్యాలరీలు, 8 వేలకు పైగా కళాఖండాలు

ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపానుగా బలపడుతున్న ‘అక్వాన్’: 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

ఆంధ్రప్రదేశ్
