మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేతో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం ఉండవల్లి వాదనలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అన్ని అంశాలను పరిశీలించాక ఇది వ్యక్తిగత వివాదంలా కనిపిస్తోందని, ఆయన వాదిస్తున్న కొద్దీ అనుమానాలు మరింత పెరుగుతున్నాయని పేర్కొంది.
మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే డిపాజిటర్లకు రూ.2,500 కోట్లు తిరిగి చెల్లించామని, మరో రూ.5.23 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉందని, ఆ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేశామని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగిందని కూడా వివరించారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.







