ఆసియాలోనే అతిపెద్ద బరైట్స్ నిక్షేపాలుగా పేరొందిన మంగంపేట గనులకు సంబంధించిన బల్క్ టెండర్‌ను రద్దు చేయాలని ఒక నిజనిర్ధారణ కమిటీ కోరింది.
టెండర్ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్టు కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
రాష్ట్ర గనుల శాఖ ఈ నివేదికను పరిశీలనలోకి తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.






