ఏలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న హైబ్రిడ్ వంగడాలను సాగు చేయడం ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అన్నారు.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను అవలంబించాలని ఆయన రైతులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల ద్వారా రైతులు లబ్ధి పొందాలని కోరారు.

వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.