విజయవాడలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. నగరంలోని రామలింగేశ్వర నగర్లో ఉన్న ఇస్కాన్ దేవాలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ నేత బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. దేవాలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించడంతోపాటు, రాత్రి వేళల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
పండుగ సందర్భంగా నగరవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత భక్తిప్రపత్తులతో కొనసాగాయి.






