కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కళాశాల హాస్టల్‌లో సెల్‌ఫోన్ కారణంగా విద్యార్థినుల మధ్య ఘటన చోటుచేసుకుంది. తన ఫోన్ కనిపించడం లేదని మణిపూర్కు చెందిన ఓ విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హాస్టల్‌లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిబంధనలకు సంబంధించి విద్యార్థినుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కళాశాల యాజమాన్యంతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.