రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి ఎన్నికల్లో ఆ నేతలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమన్వయకర్తలు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి స్థానంలోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని, ఏకగ్రీవాలను నిర్వహణ లోపంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునేందుకు స్థానిక ఎన్నికలను ఒక అవకాశంగా వినియోగించుకోవాలని నేతలకు జగన్ పిలుపునిచ్చారు.