వరుస ఎన్నికల పరాజయాల అనంతరం పార్టీని పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించారు.
తాడేపల్లి కేంద్రంగా రూపొందించిన వ్యూహాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్‌ను సమాయత్తం చేసే పనిలో వైసీపీ నిమగ్నమైంది.






