వ్యక్తిగత విమర్శలతో తరచూ వేడెక్కే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు, అనుచిత వ్యాఖ్యలు కనిపిస్తున్న నేపథ్యంలో అధికార టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మంగళవారం వేర్వేరుగా అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.
ఐటీడీపీ హెచ్చరిక
కూటమి పార్టీల నేతలతో పాటు వైఎస్సార్‌సీపీ నేతల వ్యక్తిగత జీవితాలపై ఎవరైనా వ్యాఖ్యలు చేయడం, చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని ఐటీడీపీ స్పష్టం చేసింది. తమకు అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎవరైనా వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు దృష్టికి వస్తే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వ్యక్తులు సొంతంగా వెల్లడించే అభిప్రాయాలతో, ఇతరులు చేసే అవమానకర వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది.
వైఎస్సార్‌సీపీ నాలుగు సూచనలు
ఇవి పూర్తిగా వ్యక్తిగత విషయాలు కావడంతో సంబంధిత వ్యక్తుల గోప్యతను గౌరవించాలని వైఎస్సార్‌సీపీ తన పార్టీ నేతలు, అధికార ప్రతినిధులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులను కోరింది. ఈ మేరకు నాలుగు సూచనలు చేసింది:







