గుంటూరు-చిలకలూరిపేట రహదారిపై ఉన్న కొమ్మమూరు కాలువ వంతెనలో కొంతభాగం కుంగిపోయింది. దీనిపై స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న రహదారుల శాఖ అధికారులు వంతెనను పరిశీలించి, భద్రతా దృష్ట్యా ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించే ఏర్పాట్లు చేశారు.

వంతెన నిర్మాణంలో లోపాలపై సాంకేతిక బృందంతో విచారణ జరిపించనున్నట్టు అధికారులు తెలిపారు.