ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయ పరంపరను అధికార కూటమి పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అన్ని జిల్లాల్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌లలో 27 జడ్పీలను కూటమి కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ప్రతిపక్ష వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తోంది.
జడ్పీటీసీ స్థానాల్లో కూటమి హవా
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వాటిలో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో పార్టీల వారీగా బలాబలాలు ఇలా ఉన్నాయి:
- కూటమి మొత్తం: 473 స్థానాలు
- టీడీపీ: 384
- జనసేన: 70
- బీజేపీ: 19
- వైసీపీ: 57
- స్వతంత్రులు: 4
ఎంపీటీసీల్లోనూ టీడీపీదే పైచేయి
మొత్తం 9,821 ఎంపీటీసీ స్థానాల్లో 2,051 ఏకగ్రీవం కాగా, 7,767 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ప్రకటించిన ఫలితాల్లో కూటమి అభ్యర్థులు 5,819 స్థానాలు గెలుచుకున్నారు.







