రాష్ట్రంలో టైటానియం, అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్) పరిశ్రమను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకురానుంది.

ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సుమారు 65 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తీర ప్రాంతాల్లో లభ్యమయ్యే ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని, స్థానికంగానే శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సాహాలు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు.

దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తిని పెంచే వ్యూహంలో భాగంగా కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం.