రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్'ను ఏర్పాటు చేసింది.

నగరాలు, పట్టణాల్లోని సీసీ కెమెరాల నెట్‌వర్క్‌ను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే సదుపాయాన్ని ఈ కేంద్రం కల్పిస్తుంది. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రతకు ఇది ఉపయోగపడనుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ వ్యవస్థను దశలవారీగా అన్ని జిల్లాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.