రాష్ట్రంలో అక్టోబర్ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పురపాలక సంఘాల్లో వార్డుల డీలిమిటేషన్ (పునర్విభజన) ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల పునర్విభజన చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి, ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
వార్డుల పునర్విభజనపై ఇప్పటికే వివిధ పార్టీల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే ప్రక్రియ కూడా మొదలైంది.






