వివిధ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల సంఘం, తమ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్టు హైకోర్టుకు తెలియజేసింది. ప్రజారోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలన్న న్యాయస్థానం సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, న్యాయమైన పరిష్కారం కోసం చర్చల ద్వారా ముందుకు వెళ్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.
సమ్మె విరమణతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.







