ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం జరుపుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. 30కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.
కేబినెట్ ముందుకు కొత్త పాలసీలు
రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో ముందు వరుసలో నిలిపేందుకు పలు ముసాయిదా పాలసీలు కేబినెట్ పరిశీలనకు వచ్చాయి.
- ఏపీ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ పాలసీ (2026–31)
- రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ
- ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ (4.0) పాలసీ
ఏఐ డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు
- విశాఖ జిల్లా భీమిలిలో రూ.31,387 కోట్లతో గ్రీన్ ఏఐ డేటా సెంటర్
- విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్
- అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్లతో ఇప్యాక్ డేటా సెంటర్
- నాయుడుపేటలో రూ.4,000 కోట్లతో కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్లాంట్
- తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్
- పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రావలి స్పిన్నర్స్ విస్తరణ – సుమారు 1,569 మందికి ఉపాధి
భూకేటాయింపులు, పారిశ్రామిక పార్కులు
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్‌కు 173.82 ఎకరాల కేటాయింపు, అన్నమయ్య జిల్లాలో స్కెచర్స్ (స్కికార్ప్) గ్రూప్ ఆధ్వర్యంలో 56.82 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్క్, జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు అజెండాలో ఉన్నాయి.







