ఆంధ్రప్రదేశ్బ్రేకింగ్
బీసీలకు 34% కోటా ఖరారు.. ఏపీ స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం
పంచాయతీరాజ్ సంస్థల్లో రిజర్వేషన్లపై కేబినెట్ ఆమోదముద్ర... సెప్టెంబర్ 3 నుంచి ఓటర్ల జాబితాల ప్రచురణ

పంచాయతీరాజ్ సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 3 నుంచి ఓటర్ల జాబితాల ప్రచురణకు ఆదేశాలిచ్చింది. ఈ రెండు పరిణామాలతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ నాటికి జరిగే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుగా ఉన్న ప్రధాన సమస్య పరిష్కారమైంది. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ నివేదిక సమర్పించగా, దాని ఆధారంగా మంగళవారం (ఆగస్టు 18) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఎంఎస్ నంబర్ 105ను ప్రభుత్వం విడుదల చేసింది.
రిజర్వేషన్ల అంశం సద్దుమణగడంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఫొటో ఎలక్టోరల్ రోల్స్‌ను సెప్టెంబర్ 3న ప్రచురించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 1, 2026 తేదీని ప్రామాణికంగా తీసుకుని తుది ఓటర్ల జాబితాలు రూపొందించనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. తొలుత పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, తర్వాతి దశలో గ్రామ పంచాయతీలకు పోలింగ్ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని సన్నాహాలు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు: నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల్లో చర్మ, దంత సమస్యలు, రక్తహీనత: 2.65 లక్షల మందికి వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: కిలోమీటర్ పరిధిలో ప్రజల తరలింపు

ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్త హంగులతో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం: 14 గ్యాలరీలు, 8 వేలకు పైగా కళాఖండాలు

ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపానుగా బలపడుతున్న ‘అక్వాన్’: 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

ఆంధ్రప్రదేశ్
