ఆంధ్రప్రదేశ్
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు.. భార్య మీనా మృతదేహం లభ్యం

గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఈ నూకరాజు కుటుంబంలో గల్లంతైన ఆయన భార్య మీనా మృతదేహం ఆరు రోజుల తర్వాత లభ్యమవడంతో గాలింపు ముగిసింది.
రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు కమ్ రైల్వే వంతెనపై నుంచి ఆగస్టు 16న అర్ధరాత్రి పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా (55), కుమార్తె సౌజన్య గోదావరిలో దూకిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నూకరాజు మనవడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. నూకరాజు మృతదేహం ఆగస్టు 17న, కుమార్తె సౌజన్య మృతదేహం ఆగస్టు 20న లభ్యం కాగా, భార్య మీనా జాడ కోసం గత ఆరు రోజులుగా సాగుతున్న గాలింపులో శనివారం ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన అలమూరు మండలం వద్ద 30 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దీంతో గాలింపు చర్యలకు తెరపడింది. తమను వేధింపులకు గురిచేసిన శిక్షణా కేంద్రం కోచ్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తల కోసం మా WhatsApp ఛానెల్‌ని ఫాలో అవ్వండి
సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్
23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు: నవంబర్ 26న స్థానిక సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల్లో చర్మ, దంత సమస్యలు, రక్తహీనత: 2.65 లక్షల మందికి వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: కిలోమీటర్ పరిధిలో ప్రజల తరలింపు

ఆంధ్రప్రదేశ్
తిరుమలలో సరికొత్త హంగులతో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం: 14 గ్యాలరీలు, 8 వేలకు పైగా కళాఖండాలు

ఆంధ్రప్రదేశ్
తీవ్ర తుపానుగా బలపడుతున్న ‘అక్వాన్’: 20న నెల్లూరు–తుని మధ్య తీరం దాటే అవకాశం

ఆంధ్రప్రదేశ్
